Mahavatar Narsimha : 6 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే.. 800 శాతం కలెక్షన్స్..
తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసారు.

Mahavatar Narsimha
Mahavatar Narsimha : హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహ’. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు అవతారలపై యానిమేషన్ సినిమాలను మొదలుపెట్టగా అందులో మొదటి సినిమాగా మహావతార్ నరసింహ జూలై 25న రిలీజయింది.
తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా, భారీ ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆడియన్స్ కి మహావతార్ నరసింహ సినిమా ఫుల్ గా నచ్చేసింది. యానిమేషన్ సినిమా అయినా, భక్తి సినిమా అయినా ఒక పవర్ ఫుల్ కమర్షియల్ సినిమా చూసిన అనుభవం ఇచ్చారు. అందరికి తెలిసిన భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథే అయినా గూస్ బంప్స్ తెప్పించారు. సినిమా చివరి అరగంట అయితే ప్రతి షాట్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
Also Read : Siri Hanumanthu : కాబోయే భర్తతో సిరి హనుమంతు వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు వైరల్..
మహావతార్ నరసింహ సినిమా డైలీ కలెక్షన్స్ కూడా అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కేవలం 6 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అంటే షేర్ ఆల్మోస్ట్ 25 కోట్లకు పైగా వచ్చింది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు 20 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ కేవలం వారం రోజుల్లోనే వచ్చాయి.
మొదటి రోజు సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా ఆడుతుంది. మొదటి సినిమాకే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే మరి ఈ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోయే సినిమాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి.
53 CRORES India GBOC and counting… 💥
The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc
— Hombale Films (@hombalefilms) August 1, 2025
Also Read : Supritha – Surekha Vani : తల్లీకూతుళ్ల వరలక్ష్మి వ్రతం.. స్పెషల్ ఫొటోలు..