Anirudh Music Concert: అనిరుధ్ ‘XV’ మ్యూజిక్ కన్సర్ట్ కి వెళ్తున్నారా.. పార్కింగ్, టైమింగ్స్ విషయంలో ఈ రూల్స్ పాటించాల్సిందే!
హైదరాబాద్ లో అనిరుద్ రవిచందర్ ‘XV’ మ్యూజిక్ కన్సర్ట్
Anirudh XV Music Concert in Hyderabad
Anirudh Music Concert: సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న “XV – 15 ఇయర్స్ విత్ యూ” మ్యూజిక్ టూర్(Anirudh Music Concert) ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది. రేపు (మార్చి 21, శనివారం) గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియంలో జరగబోయే ఈ భారీ కన్సర్ట్ కోసం నగరం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వేలాదిగా తరలివచ్చే అభిమానుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్వాహక సంస్థలైన బ్రాండ్ అవతార్, ట్రైబ్‌వైబ్, ఓషన్ వైబ్స్ కలిసి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశాయి.
Fauzi: : ‘ఫౌజీ’ హిట్ అవ్వాల్సిందే.. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
షో సజావుగా సాగేందుకు అభిమానులు ముందుగానే వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. స్టేడియం గేట్లను సాయంత్రం 4:30 గంటల తరువాతే తెరుస్తామని, 6:00 గంటలకు షో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా పార్కింగ్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా లేకుండా టికెట్ రకాన్ని బట్టి వేర్వేరు ప్రాంతాలను కేటాయించారు. సిల్వర్, గోల్డ్ టికెట్ హోల్డర్లు తమ బైక్‌లను బోల్డర్ హిల్స్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి స్టేడియానికి వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో షటిల్ సర్వీస్ బస్సులు అందుబాటులో ఉంటాయి. వీరికి గేట్ 1, గేట్ 4 ద్వారా ప్రవేశం ఉంటుంది.
ఇక ఫ్యాన్ పిట్ హోల్డర్లు తమ కార్ల కోసం సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్‌ను ఉపయోగించుకోవచ్చు, అక్కడ కూడా షటిల్ సౌకర్యం కల్పించారు. రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ కేటగిరీ వారికి మాత్రమే గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో పార్కింగ్‌కు అనుమతి ఉంటుంది. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సొంత వాహనాల కంటే క్యాబ్‌లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా కార్ పూలింగ్ పద్ధతులను అనుసరించడం బెస్ట్ అని నిర్వాహకులు సూచిస్తున్నారు.
