Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..

గతంలో తెలుగులో సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన ఓ ఐటెం సాంగ్ లో నటించింది. తమిళ్ లో కూడా కొన్ని ఐటెం సాంగ్స్ లో నటించింది అంజలి. తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో...........

Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..

Anjali

Updated On : July 3, 2022 / 5:31 PM IST

Anjali :  ఇటీవల స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాకి వచ్చే రెమ్యునరేషన్ ఒక ఐటెం సాంగ్ తో వస్తుండటంతో హీరోయిన్స్ అందరూ ఐటెం సాంగ్ ఆఫర్స్ వస్తే వదులుకోవట్లేదు. హీరోయిన్ అంజలి ఎప్పుడో హీరోయిన్ పాత్రలు పక్కన పెట్టి ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేసేస్తోంది. ఇటీవల వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చి అందాల ఆరబోత కూడా బాగానే చేస్తుంది. తాజాగా ఓ ఐటెం సాంగ్ కి ఓకే చెప్పింది అంజలి.

Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?

గతంలో తెలుగులో సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన ఓ ఐటెం సాంగ్ లో నటించింది. తమిళ్ లో కూడా కొన్ని ఐటెం సాంగ్స్ లో నటించింది అంజలి. తాజాగా నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అంజలి పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ టైటిల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ఆగస్ట్‌ 12న విడుదల చేయబోతున్నారు.