×
Ad

Anjali Pavan : రేపు డెలివరీ అంటే ఇవాళ కరోనా.. కూతురు పుట్టాక 19 రోజులు చూపించలేదు.. అంజలి ఎమోషనల్..

తన మొదటి డెలివరీ సమయంలో పడ్డ కష్టం గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంజలి. (Anjali Pavan)

Anjali Pavan

Anjali Pavan : ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది అంజలి. మధ్యలో నటుడు పవన్ సంతోష్ తో పెళ్లి తర్వాత సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సీరియల్స్, టీవీ షోలు, యూట్యూబ్ తో బిజీగా ఉంది. తాజాగా అంజలి పవన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి పలు విషయాలు తెలిపింది.(Anjali Pavan)

అంజలి – పవన్ జంటకు దాన్వి అనే పాప, ఒక బాబు ఉన్నారు. తన మొదటి డెలివరీ సమయంలో పడ్డ కష్టం గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంజలి.

Also Read : Pawan Kalyan : పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..!?

అంజలి మాట్లాడుతూ.. అది కరోనా టైం. రేపు డెలివరీ అని టెస్టులకు వెళ్తే నాకు కరోనా వచ్చింది. నేను ఆపరేషన్ చేయను. నీకేమైనా నొప్పులు వస్తే గాంధీ హాస్పిటల్ వెళ్ళండి అని మా డాక్టర్ చెప్పింది. దాంతో అందర్నీ పంపించేసి మా అమ్మ, మా ఆయన ఉన్నారు ఇంట్లో. నాకు అప్పటికే ప్రగ్నెన్సీ వచ్చి 10 నెలలు దాటాయి. చాలా కష్టంగా ఉండేది. దాంతో 15 రోజుల తర్వాత మా డాక్టర్ ఆపరేషన్ చేయడానికి రెడీ అయ్యారు నాకు కరోనా ఉన్నా.

కరోనా పేషేంట్స్ మధ్యలో ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ అయింది. చాలా కష్టంగా జరిగింది ఆపరేషన్. పాప పుట్టింది, బాగుంది అని చెప్పారు కానీ పాపను చూపించలేదు. 19 రోజులు వేరే హాస్పిటల్ లో పెట్టారు. నన్ను చూడనివ్వలేదు నాకు కరోనా అని. హాస్పిటల్ నుంచి వచ్చేసాక కూడా నన్ను, పాపని పక్క పక్క రూమ్స్ లో ఉంచారు. చూసాను కానీ ముట్టుకోలేదు. తను ఏడిస్తే తట్టుకోలేకపోయాను. పాలు ఇవ్వకుండా దూరంగా ఉండి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. అలా పది రోజులు ఉన్న తర్వాత తన దగ్గరికి వెళ్ళాను. ఆ కష్టం ఎవరికీ రాకూడదు. ఆ తర్వాత కరోనా సమయంలో ఖాళీగా ఉండటంతో నా టైం అంతా కూతురు దాన్వి తోనే ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది.

Also See : Tharun Bhascker Eesha Rebba : తరుణ్ – ఈషా రిలేషన్ నిజమే.. టైం వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం అంటూ డైరెక్టర్ కామెంట్స్..