Pawan Kalyan : పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Gossip Garage Pawan Kalyan and Surender Reddy Movie Update
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇంతలోనే పవన్ చేయబోయే నెక్స్ట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ మూవీని లాంచింగ్ చేసి.. షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా, వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా పవన్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై లేటెస్ట్గా టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తుంది.
సురేందర్‌రెడ్డి డైరెక్షన్లో పవన్ చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతోందట. గతంలో పవన్ తనకు టైమ్ దొరికినప్పడల్లా సినిమాలకు టైమ్ ఇచ్చి ఫినిష్ చేస్తుండేవాడు. ఈసారి కూడ పవన్ అలానే చెయ్యబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
Sravanthi : అలనాటి హీరోయిన్ల లుక్‌లో యాంకర్ స్రవంతి.. నలుపు, తెలుపు రంగు చీరకట్టులో అదరహా..
అయితే సినిమాను చాలా త్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక టైటిల్ కూడా రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందనే టాక్ నడుస్తుంది. పవన్ ఓజీకి రెండు అక్షరాలే. ఈ సారి కూడ ఇదే సెంటిమెంట్‌తో పాటు మాస్ రేంజ్లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళి.. ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
