పైజామాపై ఓంకారం.. అంకిత మీద ఆగ్రహం..

  • Publish Date - September 16, 2020 / 01:34 PM IST

Ankita Lokhande trolled after she posted a picture: బాలీవుడ్ నటి అంకితా లోఖండేను నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అంకిత పోస్టు చేసిన కొన్ని ఫొటోలు చూసి ఆమెపై సీరియస్ అవుతున్నారు.



https://10tv.in/pawan-kalyans-vakeel-saab-shooting-starts-soon/
అసలేం జరిగిందంటే.. అంకిత తల్లి ఆమెకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేశారట. దీనికి సంబంధించిన ఫోటోలను అంకిత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అంకిత టీషర్ట్, పైజమాతో కనిపించింది. ఆమె ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది.


ఇది చూసి ఓ నెటిజన్ ‘మేడమ్ నాకు మీ మీద శత్రుత్వం లేదు. నేను మిమ్మల్ని ఆటపట్టించడం లేదు. మీరు ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది. మేము ఓంకారాన్ని సృష్టికి చిహ్నంగా భావిస్తాము. దీనిని మీరు పైజమా రూపంలో ధరించారు. ఈ విషయన్ని మీకు గుర్తు చేస్తున్నాను’ అని రాశారు. మరొక నెటిజన్ ‘ఈశ్వరుని పేరును కాళ్లకు దగ్గరగా ఉంచడం చాలా తప్పు’ అని రాశారు. అయితే ఈ కామెంట్లకు అంకిత స్పందించలేదు కానీ ఫొటోలు తొలగిస్తుందేమో చూడాలి..