1969 – 2019 శివన్న హిస్టరీ రిపీట్స్

‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్, పి.వాసు కాంబినేషన్లో రూపొందిన ‘ఆయుష్మాన్‌భవ’ నవంబర్ 15న విడుదల..

  • Publish Date - November 10, 2019 / 10:11 AM IST

‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్, పి.వాసు కాంబినేషన్లో రూపొందిన ‘ఆయుష్మాన్‌భవ’ నవంబర్ 15న విడుదల..

‘కరునాడ చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్, పి.వాసు కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ అండ్ ఎమెషనల్ ఫిలిం.. ‘ఆయుష్మాన్‌భవ’.. రచితా రామ్ హీరోయిన్.. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. బీఎస్ ద్వారకీష్ సమర్పణలో ద్వారకీష్ చిత్ర బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ఏడాదితో ద్వారకీష్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతుంది.

1969లో కన్నడ కంఠీరవ’ రాజ్ కుమార్‌తో ‘మేయర్ ముత్తయ్య’ చిత్రాన్ని నిర్మించిందీ సంస్థ. తర్వాత శివ రాజ్‌కుమార్‌తోనూ సినిమాలు చేశారు. నవంబర్ 15న విడుదల కానున్న ‘ఆయుష్మాన్‌భవ’తో శివన్న హిస్టరీ రిపీట్ చేయనున్నాడని కన్నడ సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే శివన్న హీరోగా ద్వారకీష్ బ్యానర్ నిర్మించిన ‘జనుమద జోడి’ 1996 నవంబర్ 15న రిలీజ్ అయ్యింది. 23 ఏళ్ల తర్వాత 2019 నవంబర్ 15న ‘ఆయుష్మాన్‌భవ’ విడుదలవుతోంది. ‘జనుమద జోడి’ సూపర్ హిట్ అయ్యింది.. ఇంకో ప్రత్యకత ఏంటంటే తేదీలు మాత్రమే కాకుండా హోస్పేట్‌లోని లక్ష్మీ థియేటర్‌లోనే ఈ సినిమాలు రిలీజ్ అవుతుండడం విశేషం. ‘ఆయుష్మాన్‌భవ’ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని కన్నడ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.