Sonu Sood: సోనూసూద్ క్రేజ్ గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకోవాల్సిన పనిలేదేమో. రీల్ మీద విలన్ లాగా కనిపించే సోనూ ఇప్పుడు భారత ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మొన్నటి వరకు సినిమాలలో నెగటివ్ పాత్రలలోనే కనిపించినా ఇప్పుడు పాజిటివ్ పాత్రలు కూడా సోనూకోసమే పుట్టుకొస్తున్నాయి. కేవలం సినిమాలే కాదు.. స్పెషల్ మ్యూజికల్ వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి.
సోనూసూద్ ఇప్పటికే పంజాబీ మ్యూజికల్ వీడియోలో నటించగా ఇప్పుడు తాజాగా మరో మ్యూజిక్ వీడియోతో సినీ లవర్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో సోనూసూద్ కు జతగా నిధి అగర్వాల్ నటించగా ఫరాఖాన్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ మ్యూజిక్ వీడియోపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది.
బుధవారం ఈ మ్యూజిక్ వీడియో ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గురువారం ఫుల్ సాంగ్ బయటకి రానుంది. అయితే.. ఫస్ట్ లుక్ లో సోనూ-నిధి జంటకి సూపర్బ్ అప్లాజ్ వస్తుంది. ఒక చేతిలో గన్ తో మరో చేతిలో నిధిని దగ్గరకి తీసుకున్న సోనూ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఫరాఖాన్ దర్శకత్వం కావడంతో ఇప్పుడు ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘సాత్ క్యా నిభావోగే’ పాట వస్తోంది రెడీగా ఉండండి అంటూ సోనూసూద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించగా ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇక పాట కూడా విడుదలైతే.. ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!
Get ready for song of the year 'Saath Kya Nibhaoge', @AgerwalNidhhi
@TheFarahkhan
@DesiMusicFactory @Tonykakkar #AltafRaja @AnshulGarg80 #desimusicfactory #SaathKyaNibhaoge pic.twitter.com/Kl5QTbKQe0— sonu sood (@SonuSood) August 3, 2021