Allu Arjun
Allu Arjun : అల్లు అర్జున ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వర్క్ ముంబైలో జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. అయితే ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా అనౌన్స్ చేసారు.
మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో ఫిక్స్ అయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే జాన్వీ కపూర్, రష్మిక, భాగ్యశ్రీ భోర్సే కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలో ఇంతమంది హీరోయిన్స్, అది కూడా అంతా స్టార్ హీరోయిన్స్ అని ఆశ్చర్యపోతుంటే తాజాగా ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తుంది.
Also Read : Producer Raja : సినిమా రివ్యూ నెగిటివ్ గా ఇచ్చాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత..
కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో అల్లు అర్జున్ డబల్ రోల్ అని, రెండు ప్రపంచాలలో ఈ సినిమా జరుగుతుందని, హీరో – విలన్ ఇద్దరూ బన్నీనే అని రూమర్స్ వచ్చాయి. తాజాగా రెండు పాత్రల్లో కాదు ఏకంగా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.
తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నాడని రూమర్ నడుస్తుంది. నాలుగు పాత్రల్లో నాలుగు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడట బన్నీ. ఇదే కనక జరిగితే బన్నీ ఫ్యాన్స్ కి పండగే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.