Shankar : శంకర్ డ్రీం ప్రాజెక్టు ఇదే అంట.. అవతార్ రేంజ్ లో తీస్తా అంటూ.. ఈసారి 1000 కోట్లు..? శంకర్ పై ట్రోల్స్..

శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Shankar : శంకర్ డ్రీం ప్రాజెక్టు ఇదే అంట.. అవతార్ రేంజ్ లో తీస్తా అంటూ.. ఈసారి 1000 కోట్లు..? శంకర్ పై ట్రోల్స్..

Shankar

Updated On : July 12, 2025 / 5:56 PM IST

Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా ఫ్లాప్స్ ని ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో భారీ ఫ్లాప్స్ చూసాడు. దీంతో అనౌన్స్ చేసిన ఇండియన్ 3 ఉంటుందో లేదో కూడా తెలీదు. శంకర్ తో సినిమా తీసేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదు. ఇలాంటి సమయంలో శంకర్ తన డ్రీం ప్రాజెక్టు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

‘వేల్పరి’ బుక్ సక్సెస్ ఈవెంట్ కి డైరెక్టర్ శంకర్ హాజరయ్యారు. తమిళ ఎంపీ, రచయిత వెంకటేశన్ ఈ బుక్ ని రాశారు. ఇతను శంకర్ కి క్లోజ్ ఫ్రెండ్. ఈ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు నా డ్రీం ప్రాజెక్టు రోబో. అది తీసేసాను. ఇప్పుడు నా డ్రీం ప్రాజెక్టు వేల్పరి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సినిమాలకు వాడిన అత్యాధునిక టెక్నాలజీని వాడి ఆ రేంజ్ లో సినిమా తీయాలని ఉంది. ఇది మన తమిళ్ ఇండియన్ సినిమాగా గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఇదే నా డ్రీమ్. ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అన్నారు.

Also Read : Anil Ravipudi – Chiranjeevi : అనిల్ రావిపూడి – మెగాస్టార్ సినిమా టైటిల్ ఇదేనా? ఆ రోజే అనౌన్స్..

దీంతో శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేల్పరి అనేది ఒక యోధుడి పేరు. తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన యోధుడు. చోళులు, పాండ్యులను కూడా ఓడించిన యోధుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన కథ ఇది. దాను ఆధారంగా బుక్ రాయగా శంకర్ ఆ బుక్ ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తానంటున్నాడు. ఆ కథ రాజులు, యుద్ధాలతో కూడి ఉంటుంది.

అయితే శంకర్ వ్యాఖ్యలను పలువురు ట్రోల్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నందుకు, నిర్మాతలని భారీ బడ్జెట్స్ ని పెట్టిస్తున్నందుకు, అసలు ఒక్కో సాంగ్ కి అన్ని కోట్ల బడ్జెట్ ఎందుకు, మరో నిర్మాతకు నష్టం చేకూరుస్తారా అంటూ పలువురు నెటిజన్లు శంకర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ వేల్పరి తీయాలంటే భారీ బడ్జెట్ కావాల్సి ఉంటుంది. తమిళ్ మీడియా ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా అది అని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో శంకర్ ని నమ్మి అంత భారీ అమౌంట్ ఎవరు పెడతారు? శంకర్ డ్రీం ఎవరు తీరుస్తారు చూడాలి.

Also Read : Mayasabha : ఇద్దరు స్నేహితుల కథ.. ‘మయసభ’ సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ – చంద్రబాబు కథతో?