Anil Ravipudi – Chiranjeevi : అనిల్ రావిపూడి – మెగాస్టార్ సినిమా టైటిల్ ఇదేనా? ఆ రోజే అనౌన్స్..
అయితే ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారా అనే ఆసక్తి నెలకొంది.

Anil Ravipudi Chiranjeevi
Anil Ravipudi – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలోను ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అనిల్ రావిపూడి సినిమా – చిరంజీవి చాన్నాళ్లకు కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతారా అనే ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి సినిమా టైటిల్స్ ఆసక్తిగా ఉంటాయని తెలిసిందే. తాజాగా టాలీవుడ్ టాక్ ప్రకారం అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమాకు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ఉండబోతుందని తెలుస్తుంది. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని తెలిసిందే. ఆ పేరునే టైటిల్ గా తీసుకున్నట్టున్నారు.
Also Read : Mayasabha : ఇద్దరు స్నేహితుల కథ.. ‘మయసభ’ సిరీస్ టీజర్ రిలీజ్.. వైఎస్సార్ – చంద్రబాబు కథతో?
ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు నాడు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఒకవేళ టైటిల్ వేరే ఏదైనా కూడా ఆగస్టు 22 కి ఈ సినిమా గ్లింప్ రిలీజ్ చేసి టైటిల్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు.