Producer Raja : సినిమా రివ్యూ నెగిటివ్ గా ఇచ్చాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత..
ఈ ఈవెంట్లో నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ...

Producer Raja
Producer Raja : రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వర్జిన్ బాయ్స్. బిగ్ బాస్ ఫేమ్ మిత్ర శర్మ, శ్రీహాన్ తో పాటు గీతానంద్, జెన్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా నిన్న జులై 11న రిలీజయింది. అడల్ట్ కామెడీతో పాటు చివర్లో ఓ మెసేజ్ ఇస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది వర్జిన్ బాయ్స్. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ… నిన్న సిటీలోని థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజాదరణ చూసి సంతోషం వేసింది. కానీ ఇంత గొప్ప ఆదరణ పొందుతున్న సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారు. మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది అని అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుండి డబ్బులు డిమాండ్ చేసి, మేము ఇవ్వకపోవడంతో మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకుగాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రివ్యూ ఇచ్చారు. కొంతమంది కావాలని మా సినిమా ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం చాంబర్లో కంప్లైంట్ చేశాము. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాము అని తెలిపారు.
Also Read : Sudigali Sudheer : చాన్నాళ్లకు సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ ఫొటోలు.. స్టైలిష్ లుక్స్ తో..
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ చూసి ఎలా ఉంటుందో అనుకున్నవారంతా థియేటర్లలో సినిమా చూశాక బాగుందన్నారు. మా సినిమాపై విషం జల్లడానికి ప్రయత్నిస్తున్న వారిపై తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. మా నటీనటులపై అతను చేసిన కామెంట్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు. నటుడు గీతానంద్ మాట్లాడుతూ.. ఎంతో మంది కలిసి ఎంతో కాలం కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము. అటువంటి సినిమాలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్లాలి. అంతేకానీ కొత్తవారు అంటూ సపోర్ట్ చేయకుండా ఉండకపోగా నెగిటివ్ గా మాట్లాడటం అనేది తప్పు. ఈ వర్జిన్ బాయ్స్ నా మూడో సినిమా అని అన్నారు.
బిగ్ బాస్ శ్రీహాన్ మాట్లాడుతూ.. మా సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు.
Also Read : Anil Ravipudi – Chiranjeevi : అనిల్ రావిపూడి – మెగాస్టార్ సినిమా టైటిల్ ఇదేనా? ఆ రోజే అనౌన్స్..