Bad Girlz
Bad Girlz : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా బ్యాడ్ గాళ్స్. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Bad Girlz)
బ్యాడ్ గాళ్స్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైరెక్టర్ బుచ్చి బాబు సానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఒక నలుగురు అమ్మాయిలు పెళ్ళికి ముందు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం, దాంతో వారి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి అని అడల్ట్ కామెడీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
Also See : Jyothi Labala : బిగ్ బాస్ ఫేమ్, నటి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
బ్యాడ్ గాళ్స్ టీజర్ మీరు కూడా చూసేయండి..
టీజర్ రిలీజ్ అనంతరం బుచ్చి బాబు సానా మాట్లాడుతూ.. బ్యాడ్ గాళ్స్ కథ నాకు చెప్పారు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నేను సుకుమార్ దగ్గర పని చేస్తున్నప్పుడు మున్నా వచ్చి సుకుమార్ గారికి కథలు చెప్పేవాడు. మున్నాని చూసే నేను డైరెక్టర్ అయిపోవాలి అనుకునేవాడిని. ఈ సినిమాలో రేణు దేశాయ్ గారు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆవిడ సినిమా ఒప్పుకున్నారు అంటేనే సినిమా బాగుంటుంది అని తెలుస్తుంది అన్నారు.
బ్యాడ్ గాళ్స్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి కామెడీ సినిమాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో ఈ బ్యాడ్ గాళ్స్ అలా ఉంటుంది. మా సినిమా టీజర్ ని నా శ్రేయోభిలాషి బుచ్చి బాబు సానా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నా మనసులో కష్టం ఉన్నా, ఆనందం ఉన్నా పంచుకునే మొదటి వ్యక్తి బుచ్చి బాబు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని తెలిపారు.
Also See : Kalvakuntla Kavitha : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టీమ్ ని అభినందించిన కవిత.. ఫొటోలు..