Anupam Kher fires on Nadav Lapid comments on Kashmir Files movie
The Kashmir Files : 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 20న మొదలయిన ఈ వేడుకలు 28 వరకు కొనసాగాయి. కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపులో ఇజ్రాయిల్ దర్శకుడు మరియు జ్యూరి హెడ్ ‘నడవ్ లాపిడ్’.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కాశ్మీర్ ఫైల్స్ ఓ కుట్రపూరితమైన మరియు అసభ్యకరమైన సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అతని మాటలకు కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్ ఘాటుగా బదులిచ్చాడు. “కొందరికి నిజాలను ఉన్నదీ ఉన్నట్లుగా చూపించడం చేతకాక, వారికీ ఇష్టమొచ్చినట్లు చూపిస్తుంటారు. ఎన్నో ఏళ్లగా కాశ్మీర్ ని మరో కోణంలో చూపిస్తూ వచ్చారు. కానీ అక్కడి అసలైన నిజాలను కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రపంచం మొత్తానికి చూపించింది. ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోతే కళ్ళు, నోరు మూసుకుని కూర్చోండి.
భారత్ మరియు ఇజ్రాయిల్ రెండు దేశాలు ఉగ్రవాదాన్ని ఎదురుకుంటున్నాయి. కాబట్టి కాశ్మీర్ లోని హిందువుల బాధను ఇజ్రాయిల్ లోని సామాన్యుడు కూడా అర్ధం చేసుకోగలడు. కానీ ప్రతిదేశంలో ఒక ఉగ్రవాది ఉంటాడుగా” అంటూ లాపిడ్ ని టెర్రరిస్ట్ గా భావించి తన ఆగ్రహం వ్యక్తం చేశాడు అనుపమ్. కాగా నడవ్ లాపిడ్ వ్యాఖ్యలను ఇజ్రాయిల్ దౌత్యవేత్తలు కూడా ఖండిస్తూ భారత్ కు క్షమాపణలు తెలియజేస్తున్నారు.
‘कश्मीर फ़ाइल्स’ का सच कुछ लोगो के गले में एक काँटे की तरह अटक गया है।वो ना उसे निगल पा रहे है ना उगल! इस सच को झूठा साबित करने के लिए उनकी आत्मा,जो मर चुकी है, बुरी तरह से छटपटा रही है।पर हमारी ये फ़िल्म अब एक आंदोलन है फ़िल्म नहीं।तुच्छ #Toolkit गैंग वाले लाख कोशिश करते रहें।? pic.twitter.com/ysKwCraejt
— Anupam Kher (@AnupamPKher) November 29, 2022