Anupama Parameswaran : డైరెక్ట్ ఓటిటి అంటున్న అనుపమ పరమేశ్వరన్..

కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది 'అనుపమ పరమేశ్వరన్'. తాజాగా ఈ భామ మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుపమ మెయిన్ లీడ్ తో తెరకెక్కిన 'బట్టర్ ఫ్లై' చిత్రంలో భూమిక, నిహాల్ కోఢాటి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఇప్పటికి ఈ సినిమా చాలా లేట్ అవుతూ వస్తుండగా, తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

Anupama Parameswaran : డైరెక్ట్ ఓటిటి అంటున్న అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran Butterfly release direct ott

Updated On : December 13, 2022 / 9:08 AM IST

Anupama Parameswaran : కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ‘అనుపమ పరమేశ్వరన్’. తాజాగా ఈ భామ మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనుపమ మెయిన్ లీడ్ తో తెరకెక్కిన ‘బట్టర్ ఫ్లై’ చిత్రంలో భూమిక, నిహాల్ కోఢాటి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఇప్పటికి ఈ సినిమా చాలా లేట్ అవుతూ వస్తుండగా, తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

Anupama Parameswaran: చీర వయ్యారంలో అనుపమ పరమేశ్వరన్ సోయగం..

అయితే ఈ సినిమా థియేటర్ లో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆడియన్స్ ని పలకరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ వీడియో షేర్‌ చేసింది. డిసెంబర్‌ 29న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. గంటా సతీశ్‌ బాబు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ తిరువళ్లూరి, రవి ప్రకాష్‌ బోడపాటి, ప్రదీప్‌ నల్లిమెల్లి నిర్మించారు.

కాగా ఈ అమ్మడు నటించిన మరో మూవీ ’18 పేజిస్’ కూడా విడుదలకు సిద్ధమైంది. అనుపమ వరుసగా రెండోసారి హీరో నిఖిల్ తో జత కడుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్ లో విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ కథని అందించిన ఈ ప్రేమ కథని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. మారి వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న అనుపమ.. లవ్ స్టోరీతో ఆకట్టుకుంటుందా, సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకుంటుందో చూడాలి.