Anupama Parameswaran dating Dhruv Vikram
నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అ.. ఆ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది వరుస చిత్రాలను చేస్తూ ఆడియన్స్ మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా.. ఈ అమ్మడు ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా ఓ స్టార్ హీరో కొడుకుతోనని అంటున్నారు.
సదరు స్టార్ హీరో కొడుకు, అనుమ పరమేశ్వరన్ ముద్దు పెట్టుకున్నట్లు ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆ స్టారో హీరో కొడుకు ఎవరు అని అంటారా? అతడు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లిచేసుకుంటారని సదరు వార్తల సారాంశం.
ఇదిలా ఉంటే.. ధ్రువ్, అనుపమలు కలిసి ‘బైసన్’ అనే మూవీలో నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో వీరిద్దరు ప్రేమికులు కనిపిస్తారట. ఇందులో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుండగా, అతడి ప్రేయసిగా అనుపమ కనిపించనుందని అంటున్నారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫోటో ఈ సినిమాలోనిది అయి ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం అనుపమ పలు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ‘పరదా’ అనే మూవీలో నటిస్తోంది.