Anupama Parameswaran : స్టేజిపై డైరెక్టర్ కి రాఖీ కట్టి.. అన్నయ్య అంటూ హగ్ ఇచ్చిన అనుపమ..

నిన్న రాత్రి ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు..

Anupama Parameswaran tied Rakhi to Eagle Director Karthik Gattamaneni

Anupama Parameswaran : రవితేజ(Raviteja) హీరోగా ఈగల్(Egale) సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలాగా ప్లాన్ చేయగా అందులో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది. దీంతో రవితేజ.. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో అని అన్నాడు. ఆ వీడియో వైరల్ అయింది.

Also Read : Hanuman Movie : ‘హనుమాన్’ సినిమా కోసం 200 రోజులు కష్టపడి ఒక ఊరిని కట్టి.. సినిమా అంతా సెట్స్ లోనే..

తాజాగా నిన్న రాత్రి ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు. దీంతో అనుపమ.. సారీ రవిగారు. నాలుగు సినిమాలు చేశాను కార్తీక్ తో. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను అని చెప్పింది. ఈ లోపు యాంకర్ సుమ ఓ రాఖీ తీసుకొచ్చి అనుపమకి ఇవ్వడంతో అనుపమ స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్ కి రాఖీ కట్టి హగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.