Hanuman Movie : ‘హనుమాన్’ సినిమా కోసం 200 రోజులు కష్టపడి ఒక ఊరిని కట్టి.. సినిమా అంతా సెట్స్ లోనే..
తాజాగా హనుమాన్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర(Art Director Nagendra ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసారు.

Hanuman Movie Art Director Nagendra tells Interesting Facts about Hanuman Movie
Hanuman Movie Sets : ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికే 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అన్ని చోట్ల సరికొత్త రికార్డులు సృష్టించింది హనుమాన్ సినిమా. ఈ సినిమాలో ప్రతి సీన్, ప్రతి షాట్ అందర్నీ మెప్పించింది. ఇక VFX అయితే ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.
అయితే ఈ సినిమాలో 90 శాతం షూటింగ్ సెట్స్ లోనే చేసారంట. సినిమా కోసం సపరేట్ గా ఊరినే సృష్టించారు. తాజాగా హనుమాన్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర(Art Director Nagendra ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసారు.
హనుమాన్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. డైరెక్టర్ ప్రశాంత్ కథ చెప్పినప్పుడే చాలా సహజంగా ఉండే ఊరు కావాలి అన్నాడు. కొండలు, జలపాతం, పొలాలు.. ఇలా మధ్యలో ఉండే ఊరిని నిర్మించాలి. ఇవన్నీ గ్రాఫిక్స్ లో చూపించినా అంజనాద్రి అనే ఊరిని మాత్రం హైదరాబాద్ దగ్గర్లో వట్టినాగులపల్లి అనే ఊర్లో ఓ వ్యవసాయ భూమిని లీజుకి తీసుకొని 200 రోజులు కష్టపడి ఊరిని నిర్మించాం. ఈ సినిమాలో కనిపించే ఊరంతా సినిమా కోసం మేము కట్టిందే. ఇక కొన్ని సీన్స్ మారేడుమిల్లి అడవుల్లో తీసాము. ఓపెనింగ్ విలన్ ఇంట్రో సీన్స్ అన్ని కొల్లూరు దగ్గర గవర్నమెంట్ డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఉన్న ఏరియాని మా సీన్స్ కి తగ్గట్టు మార్చుకొని చేసాము. ఇక క్లైమాక్స్ సీన్ రామోజీ ఫిలిం సిటీలోని మహర్షి సినిమా సెట్ లో చేసాము అని తెలిపారు.
Also Read : Director Maruthi : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో నేనేంటో చూపిస్తాను.. డైరెక్టర్ మారుతి వ్యాఖ్యలు..
ఇక ఈ సినిమాలో చూపించిన హనుమంతుని రుధిరమణి కోసం దాదాపు 100 డిజైన్స్ తయారుచేసి చివరకు ఒకటి ఫైనల్ చేశారట. ఈ రుధిరమణి పూర్తయ్యేసరికి ఆల్రెడీ సినిమా షూట్ సగం అయిపోయిందని తెలిపారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర. సినిమా అంతా అంజనాద్రి అనే ఊరు, చుట్టూ లొకేషన్స్ అంత న్యాచురల్ గా కనపడ్డాయి అంటే అది ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వల్లే.