Director Maruthi : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో నేనేంటో చూపిస్తాను.. డైరెక్టర్ మారుతి వ్యాఖ్యలు..
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Director Maruthi Interesting Comments on Prabhas RajaSaab Movie
Director Maruthi : ఈ రోజుల్లో, బస్‌స్టాప్ లాంటి చిన్న సినిమాలతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయ్యాడు మారుతి. మరోపక్క చిన్న, మంచి సినిమాలని ప్రోత్సహిస్తూ నిర్మాతగా, ప్రజెంటర్ గా కూడా ఉంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ప్రభాస్ సినిమాకు రాజాసాబ్(Raja Saab) అనే టైటిల్ ప్రకటించారు. రాజాసాబ్ సినిమా ఈ సంవత్సరం చివర్లో లేదా, వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తుందని సమాచారం. అయితే ఇటీవల రాజాసాబ్ సినిమా నుంచి నెలకొక అప్డేట్ ఇస్తామని మారుతి అన్నారు. తాజాగా ట్రూ లవర్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మారుతీ సినిమా గురించి మాట్లాడిన తర్వాత ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Chiranjeevi : పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఫొటోలు
డైరెక్టర్ మారుతీ రాజాసాబ్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా గురించి నేను మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపించాల్సిందే. కచ్చితంగా నేనేంటో ఈ సినిమాతో మీరు చూస్తారు. మంత్లీ ఒక అప్డేట్ అన్నామని చెప్పి ఏది పడితే అది ఇవ్వలేము కదా. ఒకవేళ ఏమన్నా ఇస్తే.. ఇది కూడా ఒక అప్డేటా అంటారు మళ్ళీ. త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే ఒకటి ఇస్తాము. కొంచెం వెయిట్ చేయండి. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాకు మెసేజ్ లు చేస్తున్నారు. మీకు నచ్చే విధంగానే మీరు అనుకున్న దానికంటే పది శాతం ఎక్కువే ఉండే అప్డేట్ తో వస్తాను అని అన్నారు.