#MeToo : మా ఆయన మంచోడు.. అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు..

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 03:35 PM IST
#MeToo : మా ఆయన మంచోడు.. అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు..

Updated On : September 21, 2020 / 4:24 PM IST

#MeToo Anurag Kashyap’s ex-wife Kalki Koechlin: నటి పాయల్ ఘోష్ ‘మీ టూ’ ఆరోపణలతో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అతడేం ఏకపత్నీవ్రతుడు కాడంటూ #MeToo, #ArrestAnuragKashyap హ్యాష్ ట్యాగ్లతో పోస్టులుమీద పోస్టులు చేసింది.


మరోనటి తాప్సీ, అనురాగ్‌కు మద్దతుగా ట్వీట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. కట్ చేస్తే ఇప్పుడు నటి, అనురాగ్ మాజీ భార్య కల్కీ కొచ్లిన్ ఆయనకు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన ప్రకటన చేశారామె..


‘‘ప్రియమైన అనురాగ్‌ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను పట్టించుకోకండి. మీ స్క్రిప్ట్స్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి మీరు. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చూశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్‌ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’’.. అంటూ కల్కి పేర్కొన్నారు.


‘‘అలాగే ఇది చాలా ప్రమాదకరమైన సమయం. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ ఎదుటివారిని విమర్శించడం, తప్పుడు వాదనలు చేయడం లాంటివి చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’.. అంటూ కల్కీ ఓ ప్రకటన విడుదల చేశారు.


కాగా అనురాగ్ డైరెక్ట్ చేసిన Dev.D (దేవ్.డి) షూటింగ్ టైంలో అతనితో ప్రేమలో పడి 2011లో పెళ్లి చేసుకుంది కల్కీ.. 2013లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

https://www.instagram.com/p/CFY1pdgBSG-/?utm_source=ig_web_copy_link