Anushka – Prabhas : ప్రభాస్ ఫేవరెట్ రెసిపీ ఏంటో చెప్పమంటూ అనుష్క పోస్ట్.. డార్లింగ్ రిప్లై ఇస్తాడా..?

అనుష్క తన తన ఫేవరెట్ డిష్ ఏంటో చెప్పి.. ప్రభాస్ ని తన తన ఫేవరెట్ చెప్పంటూ ఒక ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది.

Anushka challenge prabhas with Miss Shetty Mr Polishetty recipe challenge

Anushka – Prabhas : అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టితో (Naveen Polishetty) కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటివరకు అనుష్క ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమోషన్స్ పనులు అన్ని నవీన్ పొలిశెట్టే చేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా అనుష్క కూడా ఎట్టకేలకు ఈ సినిమా కోసం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అనుష్క ఈ మూవీలో చెఫ్ గా కనిపించబోతుంది.

Mega 157 : చిరంజీవి, వసిష్ఠ సినిమా మొదలయ్యేది అప్పుడేనా..?

దీంతో తన ఫేవరెట్ రెసిపీ ఏంటో చెప్పి ఒక ఛాలెంజ్ ని స్టార్ చేసింది. #MSMPrecipechallenge అంటూ ప్రభాస్ ని ట్యాగ్ చేస్తూ ఒక కొత్త ఛాలెంజ్ ని మొదలు పెట్టింది. మంగుళూరు చికెన్ క్రరీ, నీర్ దోశ తన ఫేవరెట్ డిష్ అంటూ వాటి రెసిపీలు షేర్ చేస్తూ.. ప్రభాస్ కు ఛాలెంజ్ విసిరింది. నీ ఫేవరెట్ డిష్ రెసిపీ ఏంటో చెప్పు అంటూ అడిగింది. అలాగే ఈ ఛాలెంజ్ ని మరోకరితో ట్యాగ్ చేసి కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానులు.. “మొదటిలోనే భలే వ్యక్తిని ట్యాగ్ చేశావు స్వీటీ. అసలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండని ప్రభాస్ నీకు రిప్లై ఇస్తాడా..?” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Miss Shetty Mr Polishetty : చిరు రివ్యూస్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తొలి ప్రేక్షకుడ్ని నేనే..

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి ప్రభాస్ అనుష్కకు రెస్పాండ్ అయ్యి తన ఫేవరెట్ డిష్ ఏంటో చెబుతాడా..? అలాగే ప్రభాస్ ఎవర్ని ట్యాగ్ చేస్తాడు అనేదాని పై అందరిలో ఆసక్తి నెలకుంది. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేశాడు.