Anushka Naveen Polishetty Miss Shetty Mr Polishetty Movie postponed again
Miss Shetty Mr Polishetty Movie : అనుష్క టైమ్ బాలేనట్టుంది. అసలే గ్యాపొచ్చేసింది అనుకుంటుంటే చేతిలో ఉన్న ఒక్క సినిమా లేటవుతోంది. బాహుబలి నుంచి వరసగా సీరియస్ సినిమాలు చేస్తూ ట్రాక్ మారిన అనుష్క ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇద్దామని ట్రై చేస్తోంది. సౌత్ సినిమాని సోలో స్టార్ హీరోయిన్ గా ఏలిన అనుష్క ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది.
బాహుబలి తర్వాత భాగమతి పర్వాలేదనిపించినా, ఆ తర్వాత నిశ్శబ్దం నిరాశపరిచింది. 2020లో వచ్చిన ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ చేస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేయగానే అభిమానులు సంతోషించారు. ఇక గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
ఇప్పటికే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవుతోంది. ఆగస్ట్ 4న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ లవ్ కామెడీ ఎంటర్టైనర్ అనౌన్స్ చేసిన డేట్ కి రాదని తెలుస్తోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉంది. అందుకే సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయినట్టు టాక్. లాస్ట్ మంత్ వరకూ పాటల హడావిడి జరిగినా మళ్లీ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయినట్టే అంటున్నారు టాలీవుడ్ జనాలు.
మిస్ శెట్టి మిస్టర్ పోలివెట్టి సినిమాకు సంబందించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఆగస్ట్ 4న రావాల్సిన సినిమా రిలీజ్ అవ్వడం లేదని సమాచారం. ఇప్పటి వరకూ అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా కనీసం సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చెయ్యకపోవడం, ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్న సినిమాకి ఎలాంటి ప్రమోషన్లు చెయ్యకపోవడంతో అనుష్క సినిమా గ్యారంటీగా పోస్ట్ ఫోన్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే అనుష్కని వెండితెరపై చూసి మూడేళ్లు అవుతుందని మళ్ళీ సినిమా వాయిదానా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.