మరోసారి నాగార్జునతో జోడీ కట్టనున్న అనుష్క..!

అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తుంది. త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. అయితే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తర్వాత కూడా నాగ్ సరసన పలు సినిమాలలో నటించింది.
తనని ఎంతగానో ప్రోత్సహించిన నాగ్‌పై ఉన్న అభిమానం తోనే ఆయన సినిమాలలో గెస్ట్ పాత్రలకైన సై అంటుంది. నాగార్జున త్వరలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చిత్రం చేయనున్నాడు. పోర్చుగల్‌లో చిత్ర తొలి షెడ్యూల్ జరగనుందని సమాచారం. ఇందులో కథానాయికగా పాయల్ రాజ్‌పుత్ నటించనుండగా, ముఖ్య పాత్రలో అనుష్కని ఎంపిక చేసినట్టు టాక్.