ఓ టీవీ కార్యక్రమంలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన అనుష్క..
‘లేడి సూపర్ స్టార్’ అనుష్క, వెర్సటైల్ యాక్టర్ ఆర్.మాధవన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో.. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ క్రాస్ ఓవర్ మూవీ ‘నిశ్శబ్దం’.
ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా చేపడుతున్న ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది మూవీ టీమ్. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, హేమంత్ మధుకర్ తదితరులు అటెండ్ అయ్యారు.
ఆ కార్యక్రమంలో భాగంగా సుమ, ‘ప్రభాస్‌తో స్నేహాన్ని వదులుకుంటారా? సినిమాల్లో యాక్టింగ్ మానుకుంటారా?’ అని అడిగ్గా ‘సినిమాల్లో యాక్టింగ్ వదులుకుంటా కానీ.. వృత్తి కోసం స్నేహాన్ని వదులుకోలేను. స్నేహం కోసం ప్రాణాన్ని పణంగా పెడతా’’ అని చెప్పింది అనుష్క.
అలాగే ప్రభాస్ గురించి ఒక పాజిటివ్ చెప్పమనగా ‘మనుషులంటే చాలా ఇష్టం ఉండే పర్సన్’ అని కూడా చెప్పింది. దీన్ని బట్టి ప్రభాస్‌కి, అనుష్కకి మధ్య ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనిలో పనిగా ప్రభాస్, అనుష్కల గురించి కొత్త పుకార్లు కూడా పుట్టించేస్తున్నారు గాసిప్ గురువులు.
— Anju✨ (@ItzAnjuHere) March 19, 2020