Anushka Sharma: అనుష్క శర్మ బాడీగార్డ్ సోను శాలరీ ఎంతో తెలుసా..!

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ బాడీగార్డ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది..

Anushka Sharma: అనుష్క శర్మ బాడీగార్డ్ సోను శాలరీ ఎంతో తెలుసా..!

Sonu

Updated On : July 19, 2021 / 9:46 PM IST

Anushka Sharma: సెలబ్రిటీలు ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా స్టార్స్ ఆఫ్‌స్క్రీన్ లైఫ్ గురించిన విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్, ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. స్టార్స్ ఇళ్లు, వాళ్లు ధరించే వాడే వెహికల్స్, గాడ్జెట్స్.. ఇలాంటి విషయాల గురించిన వార్తలు, వాటి వివరాలు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి.

Sonu

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ బాడీగార్డ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అతగాడికి ఈ సెలబ్రిటీ ఇస్తున్న శాలరీ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. పనిలో పనిగా పలు మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క శర్మ పర్సనల్ బాడీగార్డ్ పేరు సోను.

Naga Shaurya : ఆ గాలి బొక్కల షూ అంత కాస్టా..!

Sonu

కొద్దికాలంగా అతను అనుష్క దగ్గర పనిచేస్తున్నాడు. సోను శాలరీ సంవత్సరానికి 1.2 CR. అంటే నెలకి అక్షరాలా పదిలక్షలు అన్నమాట. ఈ నెంబర్ విని, అరే, అనుష్క బాడీగార్డ్ పోస్ట్ మనకొచ్చిన బాగుండేది కదా’ అంటూ నిరుత్సాహ పడుతున్నారు కుర్రాళ్లు. ఇటీవల వమికకు జన్మనిచ్చిన అనుష్క ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంది.

Anushka Sharma