Anushka Sharma : మొన్న అమితాబ్, నిన్న అనుష్క.. ముంబై ట్రాఫిక్ తప్పించుకోవడానికి బైక్ మీద షూటింగ్స్ కు..

అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్ కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండటంతో తన బాడీగార్డ్ తో బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ.

Anushka Sharma going on bike to shooting in mumbai traffic

Anushka Sharma :  భారతదేశంలోని టాప్ సిటీల్లో ఇటీవల ట్రాఫిక్(Traffic) సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్.. లాంటి పలు నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరుగుతుంది. కొంతమంది ఈ ట్రాఫిక్ సమస్యని తప్పించుకోవడానికి కార్లు ఉన్నా బైక్స్(Bikes), మెట్రో(Metro) వాడుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలు పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారు.

ఇటీవల సారా అలీఖాన్, హేమ మాలిని, నవాజుద్దీన్.. ఇలా కొంతమంది సెలబ్రిటీలు ముంబై ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి మెట్రోకి వెళ్లారు. ఇప్పుడు మరికొంతమంది బైక్ మీద వెళ్తున్నారు. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి షూటింగ్ కు వెళ్లారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ బైకర్ కు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.

Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..

ఇప్పుడు అమితాబ్ బాటలోనే హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇలాగే షూటింగ్ కు బైక్ మీద వెళ్ళింది. ముంబైలో బాగా ట్రాఫిక్ ఉండటంతో తన బాడీగార్డ్ తో బైక్ మీద షూటింగ్ కి వెళ్ళింది అనుష్క శర్మ. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అమితాబ్, అనుష్క.. ఇద్దరినీ బైక్ ఎక్కించుకొని డ్రైవ్ చేసిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పలువురు నెటిజన్లు హెల్మెట్స్ పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ మాకేనా రూల్స్, సెలబ్రిటీలకు లేవా అని పోస్టులు చేస్తున్నారు.