Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..

అమితాబ్ ఇటీవల షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొంతమంది దీన్ని ఫొటో తీసి వైరల్ చేయగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..

Amitabh Bachchan take a lift from a biker in mumbai traffic photo goes viral

Amitabh Bachchan :  బాలీవుడ్(Bollywood) సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ళు వచ్చినా ఇంకా ఫుల్ యాక్టీవ్ గా సినిమాలు, షోలు చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా రెస్ట్ అనే పదం లేకుండా రోజూ షూట్స్ కి వెళ్తున్నారు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అమితాబ్ ది అని మన అందరికి తెలిసిందే. తాజాగా అమితాబ్ బచ్చన్ చేసిన ఓ పనికి అంతా ఆశ్చర్యపోయి అభినందిస్తున్నారు.

అమితాబ్ ఇటీవల షూటింగ్ కి వెళ్తుంటే ముంబైలో ట్రాఫిక్ బాగా ఉండటంతో మధ్యలోనే కార్ దిగేసి ఓ బైకర్ ని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొంతమంది దీన్ని ఫొటో తీసి వైరల్ చేయగా అమితాబ్ స్వయంగా ఆ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

The Kerala Story : 100 కోట్లకు పైగా కలెక్షన్స్.. బాలీవుడ్ సినిమాలను దాటి దూసుకుపోతున్న కేరళ స్టోరీ..

అమితాబ్ బైక్ మీద వెళ్తున్న ఫోటోని షేర్ చేసి.. రైడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ బడ్డీ. నీకు తెలియదు, కానీ నువ్వు నన్ను నా వర్క్ ప్లేస్ కి సరైన సమయానికి చేర్చావు. త్వరగా పరిష్కారం కానీ ఈ ట్రాఫిక్ జామ్ నుంచి నన్ను కాపాడారు. క్యాప్, షార్ట్, ఎల్లో షర్ట్ వేసుకున్న నీకు చాలా థ్యాంక్స్ అని తెలిపారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంతటి సూపర్ స్టార్ టైంకి వర్క్ కి వెళ్లాలని కార్ ని వదిలేసి లిఫ్ట్ అడిగి వెళ్లారంటే చాలా గ్రేట్. ఆయన దగ్గర్నుంచి మనం చాలా నేర్చుకోవాలి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.