అనుష్క బేబి బంప్ ఫొటోకు కోహ్లీ కామెంట్!..

  • Publish Date - September 13, 2020 / 08:19 PM IST

Anushka Sharma Baby Bump: అనుష్క శర్మ, కోహ్లీ దంపతులు ఇటీవల త్వరలో మాకు పండంటి బిడ్డ జన్మించబోతున్నాడని తెలుపుతూ.. పోస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. జనవరి 2021 నాటికి వారి జీవితంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని తెలిపారు. తాజాగా అనుష్క శర్మ కూడా తన జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పును ఎంతగానో ఆస్వాదిస్తున్నానని చెబుతూ.. బేబి బంప్ ఫొటో షేర్ చేశారు..


‘‘ఒక జీవి నీలో ప్రాణం పోసుకునే సందర్భాన్ని ఆస్వాదించడానికంటే నిజమైనది, మధురమైనది మరొకటి లేదు. ఇది కూడా మన కంట్రోల్‌లో లేదంటే.. ఇంకేం ఉంటుంది..?’’.. అంటూ అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌కు ఆమె భర్త విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యారు.


‘‘నా ప్రపంచం మొత్తం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది..’’ అని కోహ్లీ చేసిన కామెంట్‌ నెటిజన్ల మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం అనుష్క బేబి బంప్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.