Anushka Shetty: ఈ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మరింత పెరిగింది. ఎప్పటినుండో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్న లేదా పెద్దగా యాక్టివ్‌గా లేని వారు కూడా బాగా యాక్టివ్ అయ్యారు. స్టార్ హీరోయిన్అనుష్క కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.
తను నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉండడంతో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కను ఫాలో అయ్యే వారి సంఖ్య 4 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెబుతూ అనుష్క ఓ పోస్ట్ చేశారు.
తన ఫొటోలతో డిజైన్ చేసిన 4 మిలియన్స్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘Thankyou.. Smile always.. Love’ అంటూ స్వీటీ సంతకంతో కూడిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. అనుష్క 4 మిలియన్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఫ్యాన్స్, నెటజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు.