Miss Shetty Mr Polishetty Review : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రివ్యూ.. మరోసారి ఫుల్‌గా నవ్వించిన నవీన్.. బాలయ్య ఫ్యాన్స్‌కి స్పెషల్ సర్‌ప్రైజ్‌లు
అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ రివ్యూ. బాలయ్య ఫ్యాన్స్‌కి స్పెషల్ సర్‌ప్రైజ్‌లు..

Anushka Shetty Naveen Polishetty Miss Shetty Mr Polishetty complete Review
Miss Shetty Mr Polishetty Review : అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు. నేడు ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నవీన్ వరుస హిట్స్ తో ఉండటం, అనుష్క చాలా రోజుల తర్వాత తెరపై కనపడుతుండటంతో పాటు ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..
కథ విషయానికి వస్తే.. మాములు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ స్టాండప్ కమెడియన్ గా ఎదగాలని ట్రై చేస్తుంటాడు హీరో. ఇంటర్నేషనల్ చెఫ్ గా ఉన్న హీరోయిన్ తన తల్లి చివరి రోజులని ఇండియాలో గడపడానికి వస్తుంది. చిన్నప్పట్నుంచి తండ్రి లేకుండా తల్లితో బతకడంతో తాను కూడా పెళ్లి వద్దు కానీ ఒక బిడ్డకు అమ్మ అవ్వాలి అనుకుంటుంది. దీనికోసం స్పెర్మ్ డొనేట్ చేయడానికి ఒక మంచి అబ్బాయిని వెతుకుతూ ప్రాసెస్ లో నవీన్ ని కలుస్తుంది. తన గురించి తెలుసుకోవడానికి అతనితో ట్రావెల్ చేస్తూ అతని కెరీర్ కి కూడా ఉపయోగపడుతుంది. కానీ హీరో ఇదంతా ప్రేమ అనుకోని ప్రపోజ్ చేసే టైంకి హీరోయిన్ షాక్ ఇచ్చి నిజం చెప్తుంది. మరి హీరో స్పెర్మ్ డొనేట్ చేశాడా? హీరో ప్రేమ ఏమైంది? హీరోయిన్ తల్లి చనిపోయాక మళ్ళీ విదేశాలకు వెళ్లిపోయిందా? హీరోయిన్ తల్లి అయ్యిందా? నవీన్ స్టాండప్ కమెడియన్ అయ్యాడా అనేది తెరపై చూడాల్సిందే.
Mrunal Thakur : చిరంజీవి Mega 157లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా..?
నవీన్ తన గత సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా తాను ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి చివరివరకు అందర్నీ నవ్విస్తాడు. నవీన్ ఉన్న ప్రతి సీన్ కి థియేటర్స్ లో నవ్వులు మోగుతాయి. సెకండ్ హాఫ్ లో కామెడీతో పాటు మంచి ఎమోషన్ క్యారీ చేశారు. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తారు. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అనుష్క చాలా రోజుల తర్వాత కనపడి ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసింది. మ్యూజిక్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగాఉన్నాయి. సినిమాకి పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. డైరెక్టర్ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ తల్లిగా జయసుధ కాసేపే కనపడినా ఎమోషన్ తో మెప్పించింది.
ఇక సినిమాలో బాలకృష్ణ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ లు ఉన్నాయి. సినిమా మొదట్లోనే బాలయ్య అభిమానులు సంతోషిస్తారు. థియేటర్ అంతా జై బాలయ్య అనాల్సిందే. ఓవరాల్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇద్దరూ కలిసి నవ్వించి ఏడిపించారు. ఈ సినిమాతో నవీన్ హ్యాట్రిక్ కొడితే అనుష్క గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది.