Konidela : మెగాస్టార్ ఇంటిపేరుతో గ్రామం.. కొణిదెల గ్రామం ఎక్కడుందో తెలుసా? దత్తత తీసుకొని 50 లక్షలతో డిప్యూటీ సీఎం పవన్..
కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉంది.

AP Deputy CM Pawan Kalyan
Konidela Village : చాలా మంది ఇంటి పేర్లతో గ్రామాలు ఉంటాయని తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన ఇంటిపేరుతో ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని తన సొంత డబ్బులు అభివృద్ధికి కేటాయిస్తున్నారు. చిరంజీవి, పవన్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే. వీళ్ళు అక్కడ పుట్టకపోయినా ఆ ఇంటిపేరుతో ఓ గ్రామం ఉంది. చిరంజీవి మెగాస్టార్ అయ్యాక, ఆ ఫ్యామిలీ నుంచి హీరోలు మరింతమంది వచ్చాక కొణిదెల పేరు బ్రాండ్ అయిపొయింది. అయితే ఆ కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే చిన్న గ్రామం ఉంది. తాజాగా నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కొణిదెల గ్రామం గురించి ప్రస్తావించారు.
Also See : నా పేరు కంటే.. వెంకటేశ్వర స్వామి పేరు తలుచుకోండి: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నందికొట్కూరు ఎమ్మెల్యే గారు కొణిదెల గ్రామం గురించి చెప్పారు. ఆ గ్రామ అభివృద్ధి గురించి అడిగారు. కొణిదెల గ్రామంని నేను దత్తత తీసుకుంటాను అని చెప్పాను. నా ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి పనులు చేసిపెడతాను. అలాగే అధికారులతో మాట్లాడి గ్రామంలోకి వచ్చే పథకాలు అందచేస్తాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ గ్రామానికి కావాల్సిన పనులు అన్ని చేసి పెడతాను. పనులు చేసి తర్వాత కొణిదెల గ్రామానికి వస్తాను అని తెలిపారు. దీంతో కొణిదెల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటి పేరున్న ఓ గ్రామంని పవన్ దత్తత తీసుకోవడం, ఆ గ్రామాభివృద్ధికి మాట ఇవ్వడంతో ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆయన్ని అభినందిస్తున్నారు.