AP Govt Green Signal to Double Ismart ticket price hike
Double Ismart ticket price : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపుదిద్దుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 15న (గురువారం) ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి శుభవార్త చెప్పింది.
మూవీ టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి ఒక్కొ టికెట్‌కు రూ.35 వరకు పెంచుకోవచ్చునంటూ జీవో ఇచ్చింది. పది రోజుల పాటు ఈ సౌలభ్యాన్ని కల్పించింది. లాంగ్ వీకెంట్ నేపథ్యంలో మూవీ టీమ్‌కు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు.
Varun Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్‌తేజ్ దంపతులు
కావ్యా థపర్ హీరోయిన్ కాగా విలన్‌గా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక సినిమా హిట్ కావడం అటు పూరీకి ఇటు రామ్‌కి చాలా కీలకం.