Varun Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్‌తేజ్ దంపతులు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటుడు వరుణ్‌తేజ్ దంపతులు దర్శించుకున్నారు.

Varun Tej and Lavanya visited Tirumala
Varun Tej – Lavanya : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటుడు వరుణ్‌తేజ్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలకు చేరుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు రాత్రి తిరుమలలో బసచేశారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం బయట వీరిని చూసిన అభిమానులు, భక్తులు సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పెళ్లి తరువాత షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయానని, ఇన్నాళ్లకు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. స్వామివారి చెంత మూవీలకు సంబంధించిన విషయాలను అడగవద్దన్నారు.
JR NTR : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్..? అసలు నిజం ఇదే..
ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుణ్‌తేజ్ ప్రస్తుతం మట్కా మూవీలో నటిస్తున్నారు. కరుణకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోండగా డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.