JR NTR : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్..? అసలు నిజం ఇదే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Jr NTR injured in road accident here the true fact
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే.. ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ తెలియజేసింది. అయితే.. రెండు రోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైనట్లు వెల్లడించింది. మణికట్టు గాయంతోనే ఆయన నిన్న రాత్రి కూడా దేవర షూటింగ్‌లో పాల్గొన్నాడని, తనకు సంబంధించిన షూట్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు తెలియజేసింది.
చేతికి బ్యాండేజీతో ఉన్న ఎన్టీఆర్ చేతికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేసింది. గాయం కారణంగా ఎన్టీఆర్ రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటాడని, ఆ తరువాత సినిమా షూటింగ్స్‌లో బిజీ అవ్వనున్నట్లు వెల్లడించింది. ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని సూచించింది.
Kushboo Sundar : అలనాటి నటి ఖుష్బూ సుందర్ ఎమోషన్ పోస్ట్.. 38 ఏళ్ల క్రితం విక్టరీ వెంకటేష్..
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన షూటింగ్ నిన్న రాత్రి పూరైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది.
Venkatesh : కొత్త సినిమా షూట్ మొదలుపెట్టిన వెంకటేష్.. లుంగీ కట్టి.. లుక్ అదిరిందిగా..