Kushboo Sundar : అలనాటి నటి ఖుష్బూ సుందర్ ఎమోషన్ పోస్ట్.. 38 ఏళ్ల క్రితం విక్టరీ వెంకటేష్..
అలనాటి హీరోయిన్ ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Kushboo Sundar emotional post in Social media about her first south film
Kushboo Sundar : అలనాటి హీరోయిన్ ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ, కన్నడ, తెలుగు బాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పింది. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. అలాగే రాజకీయాల్లోనూ బిజీగా ఉంది. కాగా.. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 14 ఆగస్టు 1986లో ఖుష్బూ హీరోయిన్‌గా వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు చిత్రం విడుదలైంది.
ఈ సినిమాతోనే అటు ఖుష్బూ, ఇటు వెంకటేష్‌లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు వీరిద్దరికి వరుస అవకాశాలు వచ్చాయి. నేటితో ఈ చిత్రం 38 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఖుష్బూ సోషల్ మీడియాలో వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.
తన తొలి హీరో వెంకటేష్, దర్శకుడు కె.రాఘవేంట్ర రావులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్ తనను ఓ కుటుంబ సభ్యురాలిగా చూసుకుందని, అది ఎప్పటికి తనకు హోం బ్యానరే అని తెలిపింది. ‘నా తొలి దక్షిణాది సినిమా (14 ఆగస్టు 1986న) విడుదలై 38 ఏళ్లు పూర్తి అయ్యాయి. వెంకటేశ్ పక్కన నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా, ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. నన్ను కుటుంబంగా చూసుకున్నందుకు, డ్రీమ్ గర్ల్‌గా ప్రెజెంట్ చేసినందుకు దర్శకుడు రాఘవేంద్రరావుకి, చిత్ర బృందానికి, తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఖుష్బు.
View this post on Instagram