Appu Yojana : దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరిట హెల్త్ స్కీం.. కుటుంబ కీలక నిర్ణయం
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) గుండెపోటుతో 29 అక్టోబర్ 2021లో మరణించారు. ఆయన ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Appu Yojana
Appu Yojana health scheme : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) గుండెపోటుతో 29 అక్టోబర్ 2021లో మరణించారు. ఆయన ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జీవించి ఉన్నంత కాలం తన సంపాదనలో సగం సామాజిక సేవ కోసమే ఉపయోగించారు. వృధ్ధాశ్రమాలు, అనాథశ్రమాలు, గోశాలలకు ఎంతో నగదును విరాళంగా ఇచ్చారు. వీటన్నింటికీ తోడు 1800 మంది ఆడపిల్లల చదువు ఖర్చుల సైతం ఆయన భరించారు.
చిన్న వయసులోనే ఆకస్మిక గుండెపోటుతో అప్పు మరణించడంతో ఆయన కుటుంబ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనలా మరెవరూ కూడా గుండెపోటుతో చనిపోకూడదని బావించి ప్రభుత్వంతో కలిసి ఓ పథకాన్ని తీసుకురానున్నట్లు అప్పట్లోనే వెల్లడించారు. తాజాగా ఇందుకు బీజం పడింది. పునీత్ రాజ్‌కుమార్ పేరుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక హెల్త్ స్కీం ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు తెలిపారు.
ఆకస్మిక గుండెపోటుతో సంభవించే మరణాలను అరికట్టడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. దీనికి అప్పు యోజన (Appu Yojana) అని పేరు పెట్టారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబం అందించిన నిధులతో పాటు బడ్జెట్‌లోనూ కొంత మొత్తాన్ని కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లను (AED) ఉపకరణాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
ఎవరైనా గుండెపోటుకు గురి అయితే ఆ పరికరం సాయంతో వారికి ప్రథమ చికిత్స అందించవచ్చునని తెలిపారు. అనంతరం గంటలోపు వారిని ఆస్పత్రికి తరలిస్తే ప్రాణ నష్టాన్ని ఆపొచ్చునని మంత్రి చెప్పారు. AED ఏర్పాటు చేసేందుకు రెండు వారాల్లోగా టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదటి దశను జయదేవ ఆస్పత్రిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Bigg Boss 7 : బిగ్‍బాస్ 7 డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే షురూ.. గెట్ రెడీ