Miss Shetty Mr Polishetty Trailer : పెళ్లి వద్దు గాని ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్..
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటిస్తున్న లవ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Naveen Polishetty Anushka Shetty Miss Shetty Mr Polishetty Trailer release
Miss Shetty Mr Polishetty Trailer : యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?
ట్రైలర్ చూస్తుంటే ఇప్పటి జనరేషన్ లో జరుగుతున్న సహజీవనం అంశాన్ని తీసుకోని కామెడీ నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఉంది. తన కాళ్ళ మీద తాను నిలబడే వ్యక్తిత్వం ఉండే హీరోయిన్.. కేవలం తల్లి అవ్వడానికి మాత్రమే మగాడి హెల్ప్ కావాలి అని నమ్ముతుంది. ఈక్రమంలోనే తాను ప్రెగ్నెంట్ అవ్వడానికి హీరో హెల్ప్ అడగడం.. ఆ తరువాత జరిగే ఎమోషనల్ రైడర్ ని థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇక ట్రైలర్ లో ‘పెళ్లి వద్దు గాని ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి’ అనే కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఆగష్టు రిలీజ్ అంటూ ప్రకటించినా మళ్ళీ పోస్ట్‌పోన్ చేసి సెప్టెంబర్ కి మార్చారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. రధాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నవీన్ అండ్ అనుష్క క్రేజీ కాంబినేషన్ కావడం, స్టోరీ కూడా ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు ఉండడంతో మూవీ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.