Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?
ఆదిపురుష్ సినిమాలో హాలీవుడ్ సూపర్ హీరో ఆక్వామ్యాన్ ఉన్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మీరు గమనించారా..?

Aquaman in Prabhas Adipurush movie trolls gone viral
Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా జూన్ 16న భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రామాయణ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర వ్యతిరేకతను ఎదురుకుంటుంది. ట్రోలింగ్స్, విమర్శలు, నిషేధాలు అంటూ చిత్ర యూనిట్ తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ సినిమాలోని పాత్రల వేషధారణ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Adipurush : ఆదిపురుష్ పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్స్.. ప్రజల విశ్వాసాలను దెబ్బతియ్యడం..
ఇక ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ హీరో ఆక్వామ్యాన్ ఉన్నాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మూవీలో రావణాసురిడి కుమారుడు అయిన ‘ఇంద్రజిత్’ శరీరం నిండా టాటూ (Tattoo) లతో చూపించారు. ఆ వేషధారణ ఆక్వామ్యాన్ లా ఉందంటూ పలువురు రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే మూవీలోని VFX పై కూడా భారీ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో రావణుడు వాహనం గ్రాఫిక్స్ ని పోలుస్తూ.. ఒక వీడియోని ని షేర్ చేస్తున్నారు.
Better #VFX than #Adipurush #AdipurushTickets #BoycottAdipurush #Adipursh #Adhipurush #Prabhas? #KritiSanon #OmRaut #SaifAliKhan #manojmuntashir #Ramayana #ravan pic.twitter.com/7Ru2Tx1YFP
— GAURAV SRIVASTAVA (@GAURAVS20563120) June 16, 2023
Visionary director @omraut represented Indrajeet as Aquaman in #Adipurush
~7000 years ago present pic.twitter.com/Q6MlIrgF6n
— ??????? ♛ 2.0 (@iSoldier___) June 16, 2023
కాగా ఈ సినిమాలోని డైలాగ్స్ తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. దేవుళ్లతో ఇప్పటి ట్రెండ్ డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రజలు నుంచి పాలకులు వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని పై రైటర్ మనోజ్ ముంతాషీర్ స్పందించి.. డైలాగ్స్ మారుస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మూవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు.. తాజాగా రామ కోటి ఉత్సవం అనే ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ.. ఇప్పటి జనరేషన్ పిల్లలకి అర్ధమయ్యేలా సినిమా తీసినట్లు చెప్పుకొచ్చారు. హాలీవుడ్ సూపర్ హీరోలను త్వరగా గుర్తుపెట్టుకుని నేటి పిల్లలు.. మన దేవుళ్లను కూడా గుర్తుపెట్టుకునేలా ఆదిపురుష్ ని తెరకెక్కించినట్లు వెల్లడించారు.