Jason Momoa : 16ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పేసిన ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ దంపతులు

హాలీవుడ్ యాక్టర్ ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ మోమోవా, అతడి భార్య లిసా బోనెట్ తమ వివాహ బంధానికి స్వస్తిపలికారు. ఇద్దరు సంయుక్తంగా తమ 16ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పేశారు.

Jason Momoa : 16ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పేసిన ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ దంపతులు

Jason Momoa Aquaman Star Jason Momoa And Lisa Bonet Announce Separation After 16 Years Together

Updated On : January 13, 2022 / 7:43 PM IST

Jason Momoa Breakup : హాలీవుడ్ యాక్టర్ ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ మోమోవా, అతడి భార్య లిసా బోనెట్ తమ వివాహ బంధానికి స్వస్తిపలికారు. ఇద్దరు సంయుక్తంగా తమ 16ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పేశారు. వీరిద్దరూ 2005లో డేటింగ్ ప్రారంభించగా.. పెళ్లి చేసుకుండానే తమ బంధాన్ని కొనసాగించారు. అక్టోబర్ 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తామిద్దరూ ఏకాభిప్రాయంతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత జీవన విధానం అనేక ఒత్తిడుల జీవితం.. ఎన్నో మార్పులను చూసి ఉంటాం.. ప్రస్తుతం అదే మార్పులను అనుభవిస్తున్నాం. దీనికి మా కుటుంబం కూడా మినహాయింపు కాదు.. పరిస్థితుల దృష్ట్యా మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని జానస్ మొమోవా దంపతులు వెల్లడించారు.

ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో కూడా కారణాన్ని సోషల్ మీడియా వేదికగా జానస్ దంపతులు షేర్ చేసుకున్నారు. ఇప్పటివరకూ ఇద్దరం ఒకటిగా జీవించాం.. ఒకే మార్గంలో ప్రయాణించాం.. ఇకపై ఇద్దరు వేర్వేరుగా జీవించాలనుకుంటున్నాం. నచ్చిన మార్గంలో మిగతా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాం. మా దారులు వేరైనా మా మధ్య ప్రేమ మాత్రం అలానే కొనసాగుతుంది. మా పిల్లలు లోలా నకోవా-వోల్ఫ్‌ బాధ్యతను ఇద్దరూ చూసుకుంటాం. భార్యభర్తలుగా విడిపోయినా పిల్లల తల్లిదండ్రుల్లా కొనసాగుతామని పేర్కొన్నారు. 2007 జూలైలో జాసన్ దంపతులు తమ మొదటి బిడ్డ లోలాకు జన్మనిచ్చారు. ఆ తర్వాత రెండో బిడ్డ నకోవా-వోల్స్ డిసెంబర్ 2008లో జన్మించింది.

 

View this post on Instagram

 

A post shared by Jason Momoa (@prideofgypsies)


జాసన్ మోమోవా, లిసా బోనెట్ 2005లో జాజ్ క్లబ్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరు డేటింగ్ ప్రారంభించారు. టాక్ షో ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డెన్‌లో వీరిద్దరూ కలిసారు. అక్కడే జాసన్ మోమోవా లిసా బోనెట్‌తో డేటింగ్ మొదలైంది. అప్పటికే లిసా బోనెట్ 33 ఏళ్ల జో క్రావిట్జ్‌కి తల్లి కూడా.. ఆమె తన మాజీ భర్త లెన్నీ క్రావిట్జ్‌తో కలిసి ఉంది. 2017లో జానస్, లిసాలు భార్యభర్తలుగా మారారు. పెళ్లి అయిన నాలుగు ఏళ్లకే విడిపోతున్నట్టు ప్రకటించారు. జాసన్ మోమోవా DC సినిమాటిక్ యూనివర్స్‌లో టైటిల్ సూపర్ హీరో ఆక్వామాన్ పాత్ర పోషించాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఖల్ ద్రోగో వంటి హిట్ మూవీల్లో నటించాడు. తిమోతీ చలమెట్‌తో కలిసి డూన్‌లో చివరిగా జాసన్ కనిపించాడు. జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో ‘ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌’ మూవీతో బిజీగా ఉన్నాడు.

Read Also : Guwahati-Bikaner : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు.. ముగ్గురు మృతి