Khatija Rahman : మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్న రెహమాన్ కూతురు..

రెహమాన్ కుహురు ఖతీజా(Khatija) కూడా ఇప్పటికే సింగర్ గా పలు తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో పాడింది. ఓ పక్క సింగర్ గా పాటలు పాడుతూనే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మారింది.

Khatija Rahman : మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్న రెహమాన్ కూతురు..

AR Rahman Daughter Khatija Rahman turning as Music Director with a tamil Movie

Updated On : June 13, 2023 / 8:50 AM IST

Khatija Rahman :  AR రెహమాన్(AR Rahman) తన సంగీతంతో దేశమంతటా ప్రేక్షకులని మెప్పించాడు. ఆస్కార్(Oscar) కూడా సాధించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎప్పటికి గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఆయన పాటలు ఎప్పుడు విన్నా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ తనయుడు అమీన్(Ameen) సింగర్ గా అవకాశాలు అందుకుంటున్నాడు. రెహమాన్ కుహురు ఖతీజా(Khatija) కూడా ఇప్పటికే సింగర్ గా పలు తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో పాడింది.

ఖతీజా పెళ్లి చేసుకొని కూడా తన మ్యూజిక్ ప్రొఫెషన్ కొనసాగిస్తుంది. ఓ పక్క సింగర్ గా పాటలు పాడుతూనే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మారింది. రెహమాన్ కూతురు ఖతీజా మొదటి సారి ఓ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తుంది. తమిళ్ డైరెక్టర్ హలితా షమీమ్ తెరకెక్కిస్తున్న ‘మినీ మినీ’ సినిమాకు ఖతీజా మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది.

Tamannaah : విజయ్ వర్మతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్నా.. అతను నా హ్యాపీ ప్లేస్ అంటూ..

తాజాగా డైరెక్టర్ హలితా మ్యూజిక్ కంపోజింగ్ లో ఖతీజాతో కూర్చొని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇంత మంచి సింగర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అద్భుతమైన మ్యూజిక్ రాబోతుంది. ఖతీజాతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తాను చాలా ట్యాలెంటెడ్ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రెహమాన్ కూతురు ఖతీజా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.