Arjun Ambati : బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి గురించి తెలుసా? సీరియల్స్ తో..
అర్జున్ అంబటి.. సీరియల్ నటుడిగా అందరికి తెలుసు. ఇతని అసలు పేరు నాగార్జున రెడ్డి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్ళు పనిచేసిన అర్జున్ ఆ తర్వాత మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా మారాడు.

Arjun Ambati Serial Actor entry in Bigg Boss 7 with Wild Card
Arjun Ambati : బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7) తెలుగు అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు అయిదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం గమనార్హం. అయితే ఐదోవారంలో మళ్ళీ ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపించాడు నాగార్జున. నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే శవాలి, యూట్యూబర్, నటి నయని పావని, సోషల్ మీడియా పర్సన్, ఇప్పుడిప్పుడే నటిగా ఎంట్రీ ఇస్తున్న అశ్విని శ్రీ, సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సీరియల్ నటి పూజా మూర్తిలను నాగార్జున వేదికపైకి పిలిచి బిగ్‌బాస్ హౌస్ లోకి పంపించాడు.
అర్జున్ అంబటి.. సీరియల్ నటుడిగా అందరికి తెలుసు. ఇతని అసలు పేరు నాగార్జున రెడ్డి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్ళు పనిచేసిన అర్జున్ ఆ తర్వాత మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా మారాడు. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లలో నటించి సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం అర్జున్ సీరియల్స్ లో రెగ్యులర్ గా చేస్తున్నాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా నటిస్తూ టీవీ షోలలోను కనిపిస్తున్నాడు.
Also Read : Ashwini Sri : బిగ్‌బాస్‌లోకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ గురించి తెలుసా? హాట్ ఫొటోలతో..
తన భార్య సురేఖతో కలిసి వీడియోలు కూడా చేస్తూ ఉంటాడు అర్జున్. అర్జున్ కి ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్స్ చూసే వాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు హౌస్ లో ఎన్నాళ్ళు ఉంటాడో చూడాలి.