Babu No.1 Bullshit Guy Review : ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ.. కరోనా కాలంలో ఓ జంటని కిడ్నాప్ చేస్తే..?

'బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ సినిమా కామెడీ, ఎమోషన్ తో నవ్వించి మెప్పిస్తుంది.

Babu No.1 Bullshit Guy Review : ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ.. కరోనా కాలంలో ఓ జంటని కిడ్నాప్ చేస్తే..?

Arjun Kalyan Kushitha Kallapu Babu No.1 Bullshit Guy Movie Review and Rating

Babu No.1 Bullshit Guy Review : బిగ్‌బాస్ అర్జున్ కళ్యాణ్, కుషిత కల్లపు జంటగా లక్ష్మణ వర్మ దర్శకత్వంలో డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన కార్తీక్ బాబు (అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొస్తాడు. ఆ సమయంలోనే ఇండియాలో కరోనా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. దీంతో ఊరి చివర వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఓ విల్లాలో కొన్నాళ్లపాటు ఉండమని కార్తీక్ తండ్రి (రవి వర్మ) చెప్పడంతో తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి ఉండాలని డిసైడ్ అవుతాడు. ఇద్దరూ త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు కాబట్టి లాక్ డౌన్ కారణంగా ఆర్నెళ్లకు సరిపడా సరుకులన్నీ ఏర్పాటు చేసుకుని ఆ విల్లాలో సెటిల్ అవుతారు. అయితే ప్లంబర్ రూపంలో వచ్చిన సోంబాబు(ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి ఆ బంగ్లాలో ఫ్యామిలీతో సహా సెటిల్ అయిపోతాడు. కిడ్నాప్ అయిన కార్తీక్, కుషితలు ఎలా బయటపడ్డారు? అసలు సోంబాబు ఎవరు? వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ విదేశాల నుంచి రావడం, కార్తీక్ – కుషిత విల్లాలోకి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయడం, సోంబాబు కథ, సోంబాబు లవ్ స్టోరీ, సోంబాబు ఈ జంటని కిడ్నాప్ చేయడం చూపిస్తారు. ఆ తర్వాత కరోనా వస్తే వలసకూలీల కష్టాలు అనే ఓ ఎమోషన్ ని కూడా చూపించారు. చివర్లో ఓ ట్విస్ట్, యాక్షన్ సీన్స్ తో నడిపించారు. సినిమాలో ఎక్కువగా కామెడీతో మెప్పించారు. సినిమా చాలా వరకు ఒకే ఇంట్లో జరుగుతుంది. కుషిత, కళ్యాణ్ మధ్య రొమాంటిక్ సీన్స్ బానే ఉన్నాయి.

Also Read : ‘భీమా’ మూవీ రివ్యూ.. గోపీచంద్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడా?

నటీనటుల విషయానికొస్తే.. అర్జున్ కల్యాణ్ అమెరికా నుంచి రిటర్న్ అయ్యే డబ్బున్న అబ్బాయిలు పోష్ గా ఉన్నట్టు నటించి మెప్పించాడు. బిగ్ బాస్ తర్వాత హీరోగా ఈ సినిమాతోనే వచ్చాడు. ఫ్యూచర్ లో హీరోగా మరిన్ని సినిమాలతో వస్తాడనే చెప్పొచ్చు. కుషిత కల్లపు తన అందాలతో అలరించింది. ఈ జంట యూత్ కపుల్ గా రొమాంటిక్ గా మెప్పించారు. ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ ఆల్మోస్ట్ సెకండ్ హీరోగా నటించి అటు దర్శకుడిగా కూడా అదరగొట్టాడు. అతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి, అతని తమ్ముడిగా నటించిన వ్యక్తి, కమెడియన్ భద్రం, రవివర్మ.. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించాయి.

సాంకేతిక అంశాలు.. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. చాలా సన్నివేశాలు ఒకే లొకేషన్ లో ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. పవన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించినా పాటలు పర్వాలేదనిపిస్తాయి. కరోనా తర్వాత ఇలాంటి కథలు కొన్ని వచ్చినా దీనికి కొంచెం ఎమోషన్, చివర్లో యాక్షన్ జతచేసి దర్శకుడు లక్ష్మణ్ వర్మ బానే రాసుకున్నాడు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్తంగా ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ సినిమా కామెడీ, ఎమోషన్ తో నవ్వించి మెప్పిస్తుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.