నెటిజన్ కు బాలీవుడ్ హీరో అదిరిపోయే కౌంటర్

  • Published By: veegamteam ,Published On : September 6, 2019 / 07:00 AM IST
నెటిజన్ కు బాలీవుడ్ హీరో అదిరిపోయే కౌంటర్

Updated On : September 6, 2019 / 7:00 AM IST

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు  కురిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముంబైలో ఇలాంటి వర్షాలు కురవడం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈసారి వరదల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖ బాలీవుడ్‌ తారలు సైతం చిక్కుకుపోయారు. 

ఈ సందర్భంగా అర్జున్‌ రాంపాల్‌… బుధవారం (సెప్టెంబర్ 4, 2019)న వరదల్లో చిక్కుకున్న పరిస్థితులను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ.. నా లగ్జరీ కారు నీటిలో నడవడం చాలా కష్టం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఇండియా కార్లు మాత్రమే ముందుకు వెళ్లగలవు అంటూ పోస్ట్‌ చేశాడు. అయితే ఇందులో అర్జున్‌ రెడ్‌ కలర్‌ మెర్సిడెస్ కారును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపించడంతో.. దీనిపై స్పందించిన  నెటిజన్లు అర్జున్‌ ను ట్రోల్‌ చేస్తూ విమర్శలకు దిగారు.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌ ‘ఏం మాట్లాడుతున్నారండి, అయితే మీరు మీ రేంజ్‌​ రోవర్‌ కార్‌ వాడటం మానేసి మారుతి ఆల్టోని కొనండి’ అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు బదులుగా..’ఈ వీడియో నా ఆల్టో నుంచే తీశాను’ అని సమాధానమిచ్చాడు. ఈ కామెంట్‌ను చూసిన తన అభిమానులంతా సరిగ్గా సమాధానం చెప్పావ్‌ అంటూ అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Only Indian cars survive in this weather. Be safe. Drive Indian.

A post shared by Arjun (@rampal72) on