Iddaru Movie : ‘ఇద్దరు’ మూవీ రివ్యూ.. ఎత్తుకు పై ఎత్తులతో..

'ఇద్దరు' సినిమా ఓ డబ్బున్న వ్యక్తిని హనీ ట్రాప్ చేయాలని చూస్తే అతను దాన్ని కనిపెట్టి ఏం చేసాడు అని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

Iddaru Movie : ‘ఇద్దరు’ మూవీ రివ్యూ.. ఎత్తుకు పై ఎత్తులతో..

Arjun Sarja JD Chakravarthy Iddaru Movie Review and Rating

Updated On : October 19, 2024 / 7:14 AM IST

Iddaru Movie Review :యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి మెయిన్ లీడ్స్ లో రాధిక కుమారస్వామి, కె విశ్వనాథ్, సమీర్, సోనీ చరిష్ట, ఫైజల్ ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా ఇద్దరు. DS రెడ్డి సమర్పణలో FS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై Md. ఫర్హీన్ ఫాతిమా, నేహా చౌదరి నిర్మాతలుగా SS సమీర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా నిన్న అక్టోబర్ 18న రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సంజయ్(అర్జున్) బాగా డబ్బున్న వ్యక్తి. అతనికి చాలా కంపెనీలు ఉన్నాయి. అతని కంపెనీల్లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు JD చక్రవర్తి. అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలనుకొని సంజయ్ ని టార్గెట్ చేస్తాడు. సంజయ్ ని ఓ అమ్మాయి ట్రాప్ లో పడేసి హనీ ట్రాప్ చేసి డబ్బులు కొట్టేయాలని చూస్తాడు చక్రవర్తి. అయితే ఈ విషయం సంజయ్ కి తెలుస్తుంది. మరి సంజయ్ ఏం చేసాడు? చక్రవర్తి ఆట ఎలా కట్టించాడు?ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేశారు? చివరికి ఎవరు నెగ్గారు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Rewind : ‘రివైండ్’ మూవీ రివ్యూ.. ప్రేమ కోసం టైం ట్రావెల్ చేస్తే..

సినిమా విశ్లేషణ.. ఇద్దరు ఇంటిలిజెంట్ వ్యక్తులు ఒకరిని ఓడించాలని ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తే ఎలా ఉంటుంది అని ఆసక్తికరంగా నడిపించారు సినిమాని. ఇటీవల బయట హనీ ట్రాప్స్ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ హనీ ట్రాప్ ని ఆధారంగా తీసుకొని ఓ డబ్బున్న వ్యక్తిని ఎలా పడేయాలి అనుకున్నారు అనే కథాంశంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఒకరిని ఓడగొట్టాలని ఇంకొకరు ప్లాన్స్ వేసే స్క్రీన్ ప్లే బాగానే వర్కౌట్ అయింది. అక్కడక్కడా కొన్ని లవ్ సీన్స్ బోర్ కొట్టించినా ఒకరిపై ఒకరు వేసే ప్లాన్స్ ఆసక్తి కలిగిస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఎక్కువే ఉన్నాయి. కొన్ని ట్విస్టులు మెప్పిస్తాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్.. యాక్షన్ కింగ్ అర్జున్ గురించి కొత్తగా చెప్పేదేముంది. తన స్టైల్ తో, తన యాక్షన్ తో అదరగొట్టేసాడు. JD చక్రవర్తి కూడా నెగిటివ్ రోల్ లో బాగానే మెప్పించాడు. హీరోయిన్ రాధిక కుమార స్వామి నటనతో మెప్పించింది. సోనీ ఛరిష్టా అక్కడక్కడా తన అందంతో అలరించింది. దివంగత దర్శకుడు కె విశ్వనాధ్ అతిథి పాత్రలో మెరిశారు. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజివాల్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండుకి అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసే స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. దర్శకుడిగా సమీర్ మెప్పించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు ఎక్కువే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ఇద్దరు’ సినిమా ఓ డబ్బున్న వ్యక్తిని హనీ ట్రాప్ చేయాలని చూస్తే అతను దాన్ని కనిపెట్టి ఏం చేసాడు అని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.