Rewind : ‘రివైండ్’ మూవీ రివ్యూ.. ప్రేమ కోసం టైం ట్రావెల్ చేస్తే..

ప్రేమ కోసం టైం ట్రావెల్ చేసిన ఓ ఆసక్తికర కథ.

Rewind : ‘రివైండ్’ మూవీ రివ్యూ.. ప్రేమ కోసం టైం ట్రావెల్ చేస్తే..

Sai Ronak Amrutha Chowdary Rewind Movie Review and Rating

Updated On : November 8, 2024 / 8:54 PM IST

Rewind Movie Review : సాయి రోణక్, అమృత చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘రివైండ్’. క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా ఈ సినిమాని తెరకెక్కించారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. రివైండ్ సినిమా నేడు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కార్తిక్(సాయి రోణక్) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. తన అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె తన ఆఫీస్ లోనే పనిచేస్తుందని తెలిసి సంతోషపడతాడు. ఎలాగైనా ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాలనేలోపు శాంతినే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి షాక్ ఇస్తుంది. అయితే శాంతి తాతయ్య(సామ్రాట్) చెందిన ఒక బ్యాగ్ కార్తీక్ ఇంట్లోనే ఉండటం చూసి అది టైం ట్రావెల్ మిషన్ అని తెలుసుకుంటాడు. దీంతో ఆ మిషన్ తో వెనక్కి వెళ్లి శాంతి తన బాయ్ ఫ్రెండ్ తో కలవకుండా చేసి ప్రేమలో పడకుండా చేయొచ్చు అని అనుకుంటాడు కార్తీక్.

మరి ఆ టైం ట్రావెల్ తో కార్తీక్ వెనక్కి వెళ్లాడా? శాంతితో ప్రేమలో పడ్డాడా?అసలు ఆ మిషన్ కార్తీక్ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఆ మిషన్ తో కార్తీక్ తండ్రి చావుని ఆపాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Love Reddy : ‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ.. ఆసక్తికర టైటిల్‌తో ఎమోషనల్ లవ్ స్టోరీ..

సినిమా విశ్లేషణ.. టైం ట్రావెల్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా ఇటీవల ఈ కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. అయితే ఇందులో ప్రేమ కోసం టైం ట్రావెల్ చేయాలని లింక్ పెట్టి ఆసక్తిగా చూపించారు. ముందు నుంచి ఇది టైం ట్రావెల్ కథ అని ప్రమోషన్స్ లోనే చెప్పేసారు. శాంతి తాతయ్య తన కుటుంబాన్ని వెతుక్కుంటూ రావడంతో మొదలయిన కథ ఆ తర్వాత కార్తీక్, శాంతి ప్రేమకథలోకి ఎంటర్ అయి ఆ తర్వాత టైం మిషన్ దగ్గరికి వెళ్తుంది. లవ్ స్టోరీ కాస్త బోర్ కొట్టినా కథలోకి టైం మిషన్ వచ్చిన తర్వాత ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి బోలెడు సందేహాలు వచ్చేలా చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సందేహాలకు సమాధానాలు ఇస్తూ ట్విస్ట్ లు రివీల్ చేస్తూ ఆసక్తిగా నడిపించారు. ఊహించని క్లైమాక్స్ తో సినిమాని ఎండ్ చేసి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

Rewind Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన సాయి రోణక్ సాఫ్ట్ వేర్ పాత్రలో బాగానే నటించి మెప్పించాడు. తెలుగమ్మాయి అమృత చౌదరి తన అందంతో అలరిస్తూ హీరోయిన్ గా మొదటి సినిమాలోనే నటనతో కూడా మెప్పించింది. సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కథకు తగ్గట్టు ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ లో ప్రేమ కథ జోడించి ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. ఇక చిన్న సినిమా అయినా నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా రివైండ్ సినిమా ప్రేమ కోసం టైం ట్రావెల్ చేసిన ఓ ఆసక్తికర కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.