Leo Movie : లియో నుంచి అర్జున్ ప్రోమో రిలీజ్.. రోలెక్స్ ఎంట్రీ రేంజ్‌లో హారొల్ద్ దాస్ ఎంట్రీ..

విజయ్ లియో మూవీ నుంచి అర్జున్ ప్రోమో రిలీజ్ అయ్యింది. రోలెక్స్ ఎంట్రీ రేంజ్‌లో హారొల్ద్ దాస్ ఎంట్రీ అదిరిపోయింది.

Arjun Sarja teaser from Lokesh Kanagaraj Vijay Leo Movie

Leo Movie : లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), విజయ్ (Vijay) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘మాస్టర్’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ లియోని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష (Trisha), అర్జున్ (Arjun Sarja), సంజయ్ దత్, గౌతమ్ మీనన్.. వంటి స్టార్స్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతుంది.

Mahesh Babu : ‘బిజినెస్ మేన్’ టైంలో మహేష్ ఆ ప్రయోగం చేశాడట.. కానీ వర్క్ అవుట్ అవ్వక.. ఏంటది?

అలాగే మూవీ ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్ అండ్ టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజు నాడు మూవీలోని తన పాత్రని పరిచయం చేస్తూ ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. తాజాగా అర్జున్ బర్త్ డే సందర్భంగా సినిమాలోని తన పాత్ర ‘హారొల్ద్ దాస్’ని పరిచయం చేస్తూ ఒక మాస్ టీజర్ ని రిలీజ్ చేశారు. అరనిమిషం పైనే ఉన్న ఈ వీడియోలో అర్జున్ ని వైల్డ్ గా చూపించారు.

Reba Monica : బ్రో సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఛాన్స్ అందుకున్న రెబా మోనికా.. ఏం జరిగింది..?

అయితే ఈ టీజర్ లో అర్జున్ ఎంట్రీ చూస్తుంటే విక్రమ్ మూవీలోని సూర్య చేసిన రోలెక్స్ ఎంట్రీ గుర్తుకు వస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో చూస్తుంటే ఒకటి మాత్రం అర్ధమవుతుంది. సినిమాలో విజయ్ తో పాటు అర్జున్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉండనుందని. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు అర్జున్ టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు