Arthamainda Arun Kumar : అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2.. పది రోజుల్లో ఆహా ఓటీటీలో..

ఇటీవలే అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Arthamainda Arun Kumar Season 2 Coming Soon in Aha OTT

Arthamainda Arun Kumar : ఆహా ఓటీటీలో ప్రతీ వారం సరికొత్త సినిమాలు వెబ్ సీరిస్ వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఇందులో మరో ఫేమస్ సిరీస్ కి సీజన్ 2 రాబోతుంది. గతేడాది అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 1 వచ్చి భారీ సక్సెస్ అయ్యింది. దాంతో సీజన్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అనన్య, తేజస్వి నటించిన ఈ కామెడీ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవలే అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సీజన్ 1లో ఒక పల్లెటూరు అబ్బాయి హైదరాబాద్ కి వచ్చి జాబ్ కోసం ఎలాంటి తిప్పలు పడతారు అనేది కామెడీ రూపంలో అద్భుతంగా చూపించారు. ఇక ఇప్పుడు సీజన్ 2లో తన జాబ్ లో ఎలా పైకొచ్చాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అలాగే తన జీవితంలోకి అమ్మాయిలు ఎలా వచ్చారు, ఈ అమ్మాయిలతో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు అన్నది సీజన్ 2లో ఉండబోతున్నట్టు టీజర్ లో చూపించారు.

Also Read : Ajay : మహేష్, తారక్ అజయ్ కి అంత క్లోజా.. పిలిచి మరీ ఛాన్స్ లు ఇచ్చిన మహేష్.. కానీ..

ఇక అరుణ్ కుమార్ పాత్రలో సిద్దు పవన్ నటించాడు. సిరీస్ లో అనన్య, తేజస్విలతో పాటు సిరి రాశి సైతం కనిపించనున్నారు. అయితే సీజన్ 2 స్ట్రీమింగ్ కి మరో పదిరోజుల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే సీజన్ 1 మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు సీజన్ 2 ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.