Arthamainda Arun Kumar Season 2 coming soon in Aha Siddhu Pavan plays lead role
Arthamainda Arun Kumar : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు వస్తూ ప్రేక్షకులని మెప్పిస్తునే ఉన్నాయి. తాజాగా మరో సిరీస్ రానుంది. గత సంవత్సరం అర్థమైందా అరుణ్ కుమార్ అనే కామెడీ ఎమోషనల్ సిరీస్ ని ఆహా తీసుకురాగా ఆ సిరీస్ బాగా హిట్ అయింది. ఇప్పుడు దానికి సీజన్ 2 రాబోతుంది.
అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లో అర్థమైందా అరుణ్ కుమార్ తెరకెక్కుతుంది. మొదటి సీజన్ లో అరుణ్ కుమార్ పాత్ర ఊరి నుంచి హైదరాబాద్ కి వచ్చి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అయి ఏం చేసాడు అని ఆసక్తిగా ఆచూపించారు. ఇక తాజాగా సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఇందులో అరుణ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ గా ఎదిగి ఏం చేసాడు అని, మళ్ళీ తన లైఫ్ లోకి అమ్మాయిలు ఎలా వచ్చారు, వాళ్ళతో అరుణ్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అని ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే సీజన్ 1లో అరుణ్ కుమార్ పాత్రలో హర్షిత్ రెడ్డి నటించాడు. అయితే ఈసారి సీజన్ 2లో మాత్రం సిద్ధూ పవన్ ఆ పాత్రలో నటించాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ పవన్ ఇప్పుడు ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ లో అరుణ్ కుమార్ పాత్రలో మెప్పించబోతున్నాడు. మొదటి సీజన్ లో ఉన్న తేజస్విని మడివాడ, అనన్య ఈ సీజన్ లోను కొనసాగారు. ఈ సీజన్ లో కొత్తగా సిరి రాశి కూడా నటించింది.
ఇక అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 అక్టోబర్ 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.