సినిమా కోసం ఇంత కష్టమా? ఆర్య Most Ripped Body లుక్స్ అదుర్స్

తమిళ యంగ్ హీరో ఆర్య తన కొత్త సినిమా కోసం సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు..

  • Published By: sekhar ,Published On : February 22, 2020 / 06:23 AM IST
సినిమా కోసం ఇంత కష్టమా? ఆర్య Most Ripped Body లుక్స్ అదుర్స్

Updated On : February 22, 2020 / 6:23 AM IST

తమిళ యంగ్ హీరో ఆర్య తన కొత్త సినిమా కోసం సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు..

ప్రస్తుత పరిస్థితుల్లో హీరోలు ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవాలంటే సినిమా సినిమాకీ వేరియేషన్ చూపించాల్సిందే. తాజాగా తన కొత్త సినిమాకోసం తమిళ హీరో ఆర్య విపరీతంగా కష్టపడుతున్నాడు. ఆర్య వర్కవుట్ చేస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య ఓ సినిమా చేయనున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిజమైన బాక్సర్‌గా కనిపించడం కోసం ఆర్య గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు.

‘ఇది నా కెరీర్‌లోనే సవాల్‌తో కూడుకున్న సినిమా. అందుకోసం బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను’ అంటూ కొత్త సినిమా కోసం తను ఎంత కష్టపడుతున్నాడో ప్రేక్షకులకు తెలిపాడు. మెలితిరిగన కండలతో, సిక్స్ ప్యాక్ బాడీతో, మీసాలతో కొత్త లుక్‌లో ఆర్య అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు అన్బు అరివు యాక్షన్ కంపోజ్ చేస్తుండగా, సంతోష్ సంగీతమందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Arya posts video of intense workout, preparing for boxing film with Pa. Ranjith