Pushpa 1 : పుష్ప రివ్యూ, అదిరిపోయిందంటున్న ఉమైర్‌ సంధు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అదిరిపోయిందన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు. డిసెంబర్ 17వ తేదీన...

Pushpa 1 : పుష్ప రివ్యూ, అదిరిపోయిందంటున్న ఉమైర్‌ సంధు

Pushpa Film

Updated On : December 16, 2021 / 12:45 PM IST

Pushpa Review : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అదిరిపోయిందన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ఉమైర్ సంధు. డిసెంబర్ 17వ తేదీన ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ..రిలీజ్ కావడానికి ఒకరోజు ఉన్నా..పుష్ప సినిమా గురించి ఆయన విశ్లేషించారు. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఇతను…పుష్ప ఫస్ట్ హాఫ్ చూడడం జరిగిందంటూ..ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని కితాబిచ్చారు. సంవత్సరంలో ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని, అల్లు అర్జున్ కెరీర్ ను ఈ చిత్రం మలుపు తిప్పబోతుందని జోస్యం చెప్పారు. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతారని, హీరోహోరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందన్నారు. సుకుమార్ దర్శకత్వం బాగుందని మెచ్చుకున్నారు. ఏడు భాషల్లో ఈ ఫిల్మ్ రూపొందింది.

Read More : AP High Court: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు ఆదేశాలు

ఇక సినిమా విషయానికి వస్తే…అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మూడోది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందింది. ఇందులో అల్లు అర్జున్ వెరైటీ గెటప్ లో నటించారు. పుష్పరాజ్ గా కనిపించనున్న బన్నీ సరసన….రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించారు. ఈమె పల్లెటూరి పాత్రలో ఆకట్టుకోనున్నారు. స్టార్ హీరోయిన్ సమంత…ఓ స్పెషల్ సాంగ్ లో నటించారు. ఇప్పటికే ఈ సాంగ్ యూ ట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది.

Read More : Pushpa: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్

స్పెషల్ మీట్స్ లోనే పుష్పకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ రేంజ్ లో పుష్ప కోసం మేకోవర్ అయ్యారు అల్లు అర్జున్. గంధపు చెక్కల స్మగ్లర్ గా పూర్తిగా రా లుక్ లో కనిపించడం కోసం రెండున్నర గంటల పాటూ స్పెషల్ మేకప్ వేసుకున్నారు. హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి వాడిన బట్టలు, వస్తువుల వరకు గ్రే షేడ్స్ ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు పడ్డారు. అనసూయ ఒక డిఫరెంట్ పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్ లు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప మూవీని నిర్మించారు.